Hyderabad, మే 18 -- హైదరాబాద్ గుల్జార్‌ హౌస్‌ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ భవనంలో మంటలు చెలరేగటంతో..ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ప్రాథమిక వివరాల ప్రకారం.ఆదివారం ఉదయం ఓ భవనంలో ప్రమాదం సంభవించింది. ఈక్రమంలోనే భవనంలో ఉన్న ఏసీ కంప్రెషర్ పేలటంతో తీవ్రత పెరిగింది. ఈ ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు.

ఈ అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. షీతల్‌ జైన్‌ (37), రాజేందర్‌ కుమార్‌ (67), సుమిత్ర (65), మున్నిబాయి (72), ఇరాజ్‌ (2), అభిషేక్‌ మోడీ (30), ఆరుషి జైన్‌ (17), హర్షాలి గుప్తా (7)ను మృతులుగా గుర్తించారు.

షార్ట్‌ సర్క్యూట్‌ వల...