భారతదేశం, ఆగస్టు 22 -- హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు హైదరాబాద్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా 50 ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్‌లను, 100 మంది ట్రాఫిక్ మార్షల్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (HCSC) ఆధ్వర్యంలో ప్రైవేట్ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ తెలిపారు.

"హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ తరపున ట్రాఫిక్‌కు సంబంధించిన రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించాం. ట్రాఫిక్ ఫోరమ్ కృషితో 100 మంది ట్రాఫిక్ మార్షల్స్‌ను, 50 ట్రాఫిక్ బైక్‌లను ప్రారంభించాం. వీటన్నింటినీ ప్రైవేట్ సంస్థలు అందించాయి. ఈ బైక్‌లు ట్రాఫిక్ జామ్‌లను నియంత్రించడంలో చాలా ఉపయోగపడతాయి. త్వరలో మరో 500 మంది ట్రాఫిక్ మార్ష...