భారతదేశం, జూలై 13 -- హైదరాబాద్‌కు చెందిన ఓ దంపతుల పెంపుడు శునకం డాలీ. రెండేళ్ల లాబ్రడార్ జాతికి చెందిన ఈ డాలీ కేవలం మొరిగే కుక్క కాదు, చిత్రాలు గీయడంలోనూ తనదైన శైలిని ప్రదర్శిస్తుంది. ఈ అబ్‌స్ట్రాక్ట్ కళాఖండాలు ఇప్పటికే చాలామంది దృష్టిని ఆకర్షించాయి.

మణికొండలో నివాసం ఉంటున్న స్నేహాంగ్షు దేబ్‌నాథ్, హోయ్ చౌదరి అనే దంపతులు డాలీని చేరదీశారు. తమ కుక్కకు చిత్రలేఖనం పట్ల ఆసక్తి ఉందని గుర్తించినప్పుడు వారు ఆశ్చర్యపోయారు.

"మా ఆయన ఆర్టిస్ట్. ఆయన పెయింటింగ్ చేస్తుంటే, డాలీ బ్రష్ లాక్కొని పారిపోయేది. అప్పుడు మా స్నేహితుల్లో ఒకరు బహుశా ఇది ఓ నిరసన కావచ్చు, ఆమె కూడా భాగస్వామ్యం కావాలనుకుంటోందేమో అన్నారు. అప్పుడే ఆమెకు బ్రష్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం" అని చౌదరి పీటీఐ వీడియోస్‌తో పంచుకున్నారు.

హైదరాబాద్‌కు చెందిన ఓ దంపతుల పెంపుడు శునకం డాలీ. రెండేళ్ల...