భారతదేశం, ఫిబ్రవరి 4 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఏప్రిల్ నుండి ఇందుకోసం అవసరమైన కార్యాచరణను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్-2026 పోటీల్లో గెలుపొందిన విజేతలను సత్కరించారు మంత్రి. అవార్డు గ్రహీతలకు జ్ఞాపికలు అందజేశారు. సామాజిక స్పృహతో లఘ చిత్రాలు రూపొందించిన యువదర్శకులు, సాంకేతిక నిపుణులు, నటీనటులను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు.

ఏపీ చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా జనవరి 11న రాష్ట్రస్థాయిలో ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా ప్రతిష్టాత్మకంగా తెనాలిలో ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ - 2026 ను విజయవంతంగా నిర్వహించినందుకు ఆంధ్ర ప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల నిర్వాహకుడు, మా-ఏపీ వ్యవ...