భారతదేశం, జూన్ 30 -- టీవీ యాంకర్, జర్నలిస్టు స్వేచ్ఛ మరణం కేసు మరోమలుపు తిరిగింది. ఈకేసులో అరెస్టయిన పూర్ణచందర్ భార్య స్వప్న ఒక వీడియో సందేశం విడుదల చేశారు. స్వేచ్ఛ కూతురు చేసిన నిందారోపణలు సరికావని, ఆ పాప వెనక ఎవరో ఉండి ఇదంతా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. స్వేచ్ఛ తన భర్తను బ్లాక్ మెయిల్ చేసేదని ఆరోపించారు.

'నేను పూర్ణచందర్ భార్య స్వప్నను. స్వేచ్ఛ నాకు పూర్ణచందర్ ద్వారానే పరిచయమైంది. ఫ్రెండ్స్ అని మాత్రమే తెలుసు నాకు. వాళ్ల మధ్య రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. స్వేచ్ఛ ద్వారానే నాకు ఈ రిలేషన్ ఉందని తెలిసింది. ఆమె నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణను అడిగాను. ఏంటిది అని అడిగితే చెప్పాడు. అప్పుడు నాకు, ఆయనకు గొడవలు స్టార్ట్ అయినయి. నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయని తెలిసింది. ఇంక నేను ఆయనను వదిలేసిన...