భారతదేశం, డిసెంబర్ 16 -- ముంబై: భారత స్టాక్ మార్కెట్‌లో మంగళవారం అమ్మకాల వెల్లువ కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు మొగ్గు చూపారు. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 534 పాయింట్లు పతనమై 84,683 స్థాయికి పడిపోగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 26,000 మైలురాయిని కోల్పోయి 25,871 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.

ఈ నష్టాల ధాటికి కేవలం తొలి అరగంటలోనే ఇన్వెస్టర్ల సొమ్ము సుమారు Rs.2 లక్షల కోట్లు ఆవిరైపోయింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా అర శాతం మేర నష్టపోయాయి.

మార్కెట్ ఎందుకు పడిపోయింది? ప్రధాన కారణాలివే:

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా 91 మార్కును తాకింది. ఈ ఒక్కరోజే 36 పైసలు క్షీణించడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. విదేశీ సంస్థాగత ఇన్...