భారతదేశం, నవంబర్ 24 -- దక్షిణ అండమాన్ సముద్రంపై వాతావరణ పరిస్థితిపై ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. సెన్యార్ తుపాను ప్రభావం ఏపీపై ఉంటుందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో తాజాగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) ప్రకారం రాబోయే 48 గంటల్లో సెన్యార్ తుఫానుగా బలపడుతుందని అధికారులు తెలిపారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడనున్నాయి. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక మీదుగా మంగళవారం కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది కదులుతున్నప్పుడు మరింత బలపడి తెలుగు రాష్ట్రాలకు వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు.

నవంబర్ 28 నుండి డిసెంబర్ 01 వరకు ఏపీలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల...