భారతదేశం, మార్చి 10 -- అమెరికా టారిఫ్‌లపై ఆందోళనలు సెంటిమెంటును దెబ్బతీయడంతో బలహీనమైన ప్రపంచ మార్కెట్ సంకేతాల మధ్య ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 సోమవారం ఎరుపు రంగులో ముగిశాయి.

ట్రేడింగ్ సెషన్ తొలి అర్ధభాగంలో రెండు సూచీలు లాభాల్లో ట్రేడ్ కాగా, ట్రేడింగ్ ముగిసే సమయానికి అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ తొలుత 409 పాయింట్లు లాభపడినా చివరకు 217 పాయింట్లు (0.29 శాతం) క్షీణించి 74,115 వద్ద ముగిసింది. నిఫ్టీ 124 పాయింట్లు లాభపడి 22,676 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. బిఎస్‌ఇ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.46 శాతం, బిఎస్‌ఇ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.11 శాతం పతనమయ్యాయి.

మొత్తంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.65 లక్షల కోట్లు క్షీణించి రూ. 39.36 లక్షల కోట్లకు పరిమితమైంది. నేటి స్టాక్ మార్కెట్‌లోని 1...