భారతదేశం, జనవరి 31 -- భారతీయ రోడ్లపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న మహీంద్రా స్కార్పియో-ఎన్ ఇప్పుడు సరికొత్తగా మన ముందుకు రాబోతోంది. తాజాగా ఈ కారుకు సంబంధించిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఛండీగఢ్‌లో టెస్టింగ్ చేస్తూ కెమెరాకు చిక్కింది. దీనికి సంబంధించిన ఒక వీడియో బయటకు రాగా, అందులో రెండు టెస్ట్ వాహనాలు కనిపించాయి.

దాదాపు పూర్తిగా కవర్​ చేసి ఉన్న ఈ రెండు వాహనాల్లో ఒకటి స్టీల్ వీల్స్‌తో ఉండగా, మరొకటి సరికొత్త అలాయ్ వీల్స్‌తో ఉంది. దీని బట్టి చూస్తే మహీంద్రా సంస్థ ఒకేసారి ఈ కారుకు సంబంధించిన లోయర్ వేరియంట్, హయ్యర్ వేరియంట్లను పరీక్షిస్తోందని స్పష్టమవుతోంది.

ఈ నేపథ్యంలో మహీంద్రా స్కార్పియో ఎన్​ ఎస్​యూవీ ఫేస్​లిఫ్ట్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టెస్టింగ్‌లో ఉన్న వాహనాలను పూర్తిగా కప్పి ఉంచడం గమనిస్తే, ఎక్స్‌టీరియర్‌ డిజై...