Hyderabad, ఏప్రిల్ 16 -- సమ్మర్ సమయంలో హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూనే యూరిక్ యాసిడ్ స్థాయిలను మేనేజ్ చేయడం ముఖ్యమైన పని. డీహైడ్రేషన్‌తో పాటు హీట్ కలిగితే శరీరంలో నొప్పులు మొదలవుతాయి. ప్రత్యేకించి జాయింట్ నొప్పుల విషయంలో ఈ విషయాన్ని గమనించాలి. ఇటువంటి కీలక సమయంలో ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ తినడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉండటంతో పాటు యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపేస్తుంది. అంతేకాకుండా మిమ్మల్ని రిఫ్రెష్‌గా ఉంచుతుంది.

అనాసపండు లేదా పైనాపిల్‌గా పిలుచుకునే ఈ ఫ్రూట్‌లో బ్రొమెలైన అనే సహజ ఎంజైమ్ ఉంటుంది. ఇది ఇన్‌ఫ్లమేటరీ గుణాలను తగ్గించి వాపును నియంత్రిస్తుంది. వేసవి కాలం పైనాపిల్ తరచుగా తీసుకోవడం వల్ల లాభదాయకంగా ఉంటుంది.

నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లలో ముందుగా చెప్పుకోదగ్గది పుచ్చకాయ. ఇందులో యూరిక్ యాసిడ్‌కు వ్యతిరేకంగా పనిచేసే గుణాలు సహజంగానే ఉంటాయి. ఫలితంగా శర...