Hyderabad, జూలై 28 -- అష్టైశ్వర్యాలను ప్రసాదించే మహాలక్ష్మినీ... శ్రవణా నక్షత్రంలో జన్మించిన మహావిష్ణువునూ భక్తిశ్రద్ధలతో కొలిచే మాసమే శ్రావణం, వ్రతాలకూ, నోము లకూ ప్రసిద్ధి అయిన శ్రావణంలోనే మరికొన్ని పర్వదినాలూ వస్తాయి. అందుకే దీన్ని అధ్యాత్మిక మాసం గానూ పిలుస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని యధాశక్తితో పూజిస్తే సకల శుభాలూ కలుగుతాయని నమ్మకం. అందుకే ఈ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాల్లో లక్ష్మీదేవిని కుంకుమార్చనలూ, విశేష పూజలతో ఆరాధిస్తూనే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి ప్రతాన్ని ఆచరిస్తారు. అలాగే శ్రావణ పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమి అని పేరు.

ఈ రోజున మహిళలు తమ సోదరులకు రక్షాబంధనాలు కట్టడమూ సంప్రదాయం. ఈ తిథి నాడే వేదాలను రక్షించేంద...