Hyderabad, ఏప్రిల్ 28 -- ఈసారి ఏప్రిల్ నుంచే ఎండలు మండిపోతున్నాయి. చాలా చోట్ల ఎండ వేడి మామూలు కంటే ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో ఎండాకాలం, అంటే ఏప్రిల్ చివరి నుంచి జూన్ వరకు వేడిగాలులు రావడం సహజమే. ఉత్తర, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో అయితే మరీ ఎక్కువ. ఏదేమైనా ఈ టైమ్‌లో మనం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. రోజంగా బాగా నీళ్లు తాగాలి, ఎండలో ఎక్కువ తిరగకూడదు, పలుచని, గాలి బాగా ఆడే బట్టలు వేసుకోవాలి.

వేసవి వేడి నుంచి మన శరీరాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, కళ్లను కూడా జాగ్రత్తగా చూసుకోవడ కూడా అంతే ముఖ్యం. వేడిగాలుల వల్ల కళ్లలో మంట, పొడిబారడం, ఎర్రగా అవ్వడం, కళ్ల దురదలు, ఒక్కోసారి చూపు మందగించడం లాంటి సమస్యలు వస్తాయి. వీటన్నింటి బారిన పడకుండా కంటిని చల్లగా, ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి. ఈ ఆయుర్వేద మార్గాలు మీకంటిని కచ్చితంగా కాపాడత...