భారతదేశం, మే 5 -- విశాఖపట్నంలోని సీతమ్మధారలో విషాదం జరిగింది. భారీ వృక్షం కూలి మహిళ మృతిచెందింది. స్కూటీ మీద వెళ్తున్న మహిళపై చెట్టు కూలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలు పూర్ణిమ (38) గా పోలీసులు గుర్తించారు. విశాఖ ఏఎంజీ ఆస్పత్రి మార్గంలో పూర్ణిమ స్కూటీపై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. పూర్ణిమ భర్త స్టేట్‌ బ్యాంక్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఈ ప్రమాదంతో వాహనదారులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో అర్థంకాక పరుగులు తీశారు.

ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ విశ్రాంత అధికారులు సూచిస్తున్నారు. బలహీనంగా ఉన్న కొమ్మలను, ప్రమాదకరంగా ఉన్న చెట్లను గుర్తించ...