భారతదేశం, జనవరి 31 -- రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖలో వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు లాగేసుకున్నారని విమర్శించారు. ఏపీలో ప్రభుత్వ పాలనను చంద్రబాబు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారనడంలో ఎలాంటి సందేహం లేదని దుయ్యబట్టారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

"హలో ఇండియా. ఇది ఒక వేక్-అప్ కాల్. విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు , ఆయన కుటుంబం దాదాపు రూ.5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేసుకుంది. రుషికొండ సమీపంలో ఉన్న 54.79 ఎకరాల అత్యంత విలువైన భూములను అధికార దుర్వినియోగం ద్వారా బహిరంగంగానే కబ్జా చేసేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, అత్యంత విలువైన ఈ భూమిని తన సొంత కుటుంబ సభ్యుడైన విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్‌కు కట్టబెట్టేశారు" అని వైెఎస్ జగన్ ఆరోప...