భారతదేశం, ఆగస్టు 23 -- వినాయక చవితి అంటే మనందరికీ పండుగ వాతావరణమే గుర్తుకొస్తుంది. విఘ్నాలను తొలగించే వినాయకుడిని, జ్ఞానం, శ్రేయస్సులకు అధిపతిగా భావించి దేశవ్యాప్తంగా ఘనంగా ఈ పండుగను జరుపుకుంటాం. అయితే, 2025లో ఈ పండుగ ఎప్పుడు వస్తుంది? ఆగస్ట్ 26నా, 27నా అని చాలామందిలో గందరగోళం ఉంది. దీనికి సంబంధించిన ఖచ్చితమైన తేదీ, ముహూర్తాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ప్రతి సంవత్సరం వినాయక చవితిని భాద్రపద శుక్ల చవితి తిథి నాడు జరుపుకుంటారు. కొత్త పనులకు శ్రీకారం చుట్టడానికి, అడ్డంకులను తొలగించడానికి వినాయకుడి ఆశీస్సులు పొందేందుకు ఈ పండుగ చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఈ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

వినాయక నిమజ్జనం రోజున వినాయకుడి విగ్రహాలను అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తీసుకెళ్లి నదులు, చెరు...