భారతదేశం, ఫిబ్రవరి 4 -- తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీలో ప్రధాన మార్పులు గురువారం నుండి తెలంగాణలో అమల్లోకి వస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌మిషన్ లైన్లకు అవసరమైన దూరం ఆధారంగా వినియోగదారుల నుండి ఇకపై ఛార్జీ విధించరు.

గతంలో స్తంభాలు, లైన్స్ కోసం వినియోగదారుల నుంచి దూరం ఆధారంగా ఒక్కో విధంగా ఫీజు వసూలు చేస్తుండేవారు. కానీ ఇక మీదట ఫిక్స్‌డ్‌ ఛార్జీలు వసూలు చేయనున్నారు. మంజూరు చేసిన లోడ్‌ను బట్టి స్థిర ఛార్జీలు విధిస్తారు. గృహ విద్యుత్ కనెక్షన్ల కోసం, సవరించిన ఛార్జీలు ఈ కింది విధంగా ఉన్నాయి.

1 kW వరకు కనెక్షన్లకు రూ.500 స్థిర రుసుము వసూలు చేస్తారు. అయితే 1 kW నుండి 5 kW వరకు కనెక్షన్లకు రూ.500 ప్లస్,...