భారతదేశం, ఫిబ్రవరి 14 -- సాధారణంగా ఒలింపిక్ క్రీడలంటే రికార్డులు, పతకాల గురించి మాట్లాడుకుంటారు. కానీ ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో మాత్రం 'కండోమ్స్' కొరత హాట్ టాపిక్​గా మారింది. పోటీలు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే అథ్లెట్ల విలేజ్‌లో స్టాక్ నిండుకోవడంతో నిర్వాహకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరీ ముఖ్యంగా 3 రోజుల్లోనేే 10,000కుపైగా కండోమ్​ ప్యాకెట్లు అయిపోయినట్టు తెలుస్తోంది.

వింటర్​ ఒలింపిక్స్ కోసం​ నిర్వాహక కమిటీ ప్రారంభంలో 10,000 కండోమ్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచింది. అయితే, క్రీడాకారుల నుంచి వీటికి ఊహించని స్థాయిలో డిమాండ్ రావడంతో కేవలం మూడు రోజుల్లోనే ఈ స్టాక్ మొత్తం ఖాళీ అయిపోయిందని తెలుస్తోంది.

"సరఫరా చేసిన స్టాక్ మూడు రోజుల్లోనే అయిపోయింది. కొత్త స్టాక్ వస్తుందని వారు హామీ ఇచ్చారు కానీ, అది ఎప్పుడు వస్తుందో ఎ...