భారతదేశం, జూన్ 27 -- వర్షాకాలం రాగానే, కిటికీ పక్కన కూర్చుని చల్లగాలిని ఆస్వాదించడం, వేడివేడి ఛాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం, లేదంటే వర్షంలో తడుస్తూ ఆడుకోవడం... ఇవన్నీ ఎంతో సరదాగా ఉంటాయి కదా. కానీ, ఈ ఆనందాన్ని ఒక్క ముక్కు దిబ్బడ క్షణాల్లో దూరం చేస్తుంది. అసలు ఊపిరి ఆడక ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. మీ ముక్కు దిబ్బడను కంట్రోల్ చేసుకోవాలంటే దానికి కారణమేంటో, దాన్ని సమర్థవంతంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవాలి. గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈఎన్‌టీ (చెవి, ముక్కు, గొంతు) విభాగానికి ప్రిన్సిపల్ డైరెక్టర్, హెడ్ అయిన డాక్టర్ అతుల్ మిట్టల్ ముక్కు దిబ్బడను పోగొట్టుకోవడానికి 5 ఉత్తమ మార్గాలను హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌తో పంచుకున్నారు.

"ముక్కు మూసుకుపోవడం, దిబ్బడగా అనిపించడం.. ఇవన్నీ మన రోజువారీ పనులకు అడ్డు తగులుతాయి. నిద...