భారతదేశం, డిసెంబర్ 5 -- వడ్డీ రేట్లను 25 బేసిస్​ పాయింట్లు తగ్గిస్తున్నట్టు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా శుక్రవారం ఉదయం ప్రకటించింది. ఫలితంగా రెపో రేటు 5.5శాతం నుంచి 5.25శాతానికి దిగొచ్చింది. ఈ మేరకు మూడు రోజుల ఆర్బీఐ మొనేటరీ పాలసీ కమిటీ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్బీఐ గవర్నర్​ సంజయ్​ మల్హోత్రా ప్రకటించారు.

ఆర్బీఐ మొనేటరీ పాలసీ సమావేశం నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు నిఫ్టీ50 20 పాయింట్ల నష్టంతో 26,007 వద్ద ట్రేడ్​ అవుతోంది. బ్యాంక్​ నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 59,414 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్​ 47 పాయింట్ల నష్టంతో 85,219 వద్ద ట్రేడ్​ అవుతోంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....