భారతదేశం, ఏప్రిల్ 7 -- వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ. 50 పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు.

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ రేట్లు రూ. 2 పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి నోటిఫికేషన్ వచ్చిందని హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఈ భారాన్ని వినియోగదారుడికి బదలాయించబోమని స్పష్టం చేస్తున్నాను' అని పేర్కొన్నారు.

'అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 60 డాలర్లకు పడిపోయింది. కానీ మన చమురు మార్కెటింగ్ కంపెనీలు 45 రోజుల వ్యవధిలో ఇన్వెంటరీలను తీసుకువెళతాయని గుర్తుంచుకోండి. జనవరికి వెళితే అప్పుడు క్రూడాయిల్ ధర 83 డాలర్లు ఉండగా, ఆ తర్వాత 75 డాలర్లకు తగ్గింది. కాబట్టి వారు తీసుకువెళుతున్న క్రూడ్ ఇన్వెంటరీ బ్యారెల్‌ ధర సగటున 75 డాలర్లు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను ...