Telangana, ఆగస్టు 15 -- యూరియా కొరత రాష్ట్రంలోని రైతులను కలవరపెడుతోంది. పంపిణీ కేంద్రాల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. పీఏసీఎస్‌లకు(ప్రాథమిక వ్యవసాయ సహకర సంఘం)యూరియా లోడ్‌ వస్తుందనే సమాచారం అందింతే చాలు. అన్నదాతలు వేకువ నుంచే బారులు తీరుతున్నారు. దీంతో బస్తా యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది.

ఓవైపు వ్యవసాయశాఖ ఆశించిన స్థాయిలో యూరియా అందుబాటులో ఉండకపోవటంతో. మరోవైపు ప్రైవేటు డీలర్ల భారీగానే దండుకుంటున్నారు. 40 కిలోలు కలిగిన యూరియా బస్తా ధర రూ. 267 ఉండగా.. సింగిల్ విండోలు, ఆగ్రోస్ లో ఇదే ధరకు అమ్ముతున్నారు. కానీ ప్రైవేటు డీలర్లు మాత్రం. అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా మార్కెట్ లోని కొరత ఆధారంగా.. యూరియాను విక్రయించే విషయంలో రైతులకు మరికొన్ని కండీషన్లు కూడా పెడుతున్నట్లు తెలుస్తోంది.

యూరియా కొరతపై రాష్ట్ర...