Andhrapradesh, మే 18 -- రేపట్నుంచి ఏపీ ఈఏపీసెట్ - 2025 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపట్నుంచి (మే 19) మే 27 వరకు పరీక్షలు జరనగున్నాయి. ఈ పరీక్షలకు 3.62 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

ఏపీ ఈఏపీసెట్ -2025 పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 145 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలోని హైదరాబాద్ లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.

ఈసారి ఇంజినీరింగ్‌ విభాగంలో 2,80,597, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 81,832 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించిన ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇక మే 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్‌ స్ట...