Telangana, అక్టోబర్ 12 -- రాష్ట్రంలో గత కొంత కాలంగా బీసీ రిజర్వేషన్ల చుట్టు తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9ని తీసుకువచ్చింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ జీవోపై న్యాయస్థానం స్టే విధించింది. దీంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది.

తాజా పరిణామాలపై బీసీ సంఘాలు తీవ్రస్థాయిలో ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ జీవోపై హై కోర్టు స్టే ఇవ్వడంతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన గళాన్ని వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 14వ తేదీ రాష్ట్ర బంద్ కు పిలుపినిస్తూ బీసీ నేత, ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. అన్ని బీసీ సంఘాల మద్దతుతో బంద్‌ కు పిలుపునిచ్చామని తెలిపారు. అందరూ కలసి బంద్‌ను విజయవ...