భారతదేశం, జనవరి 25 -- కర్నూలు జిల్లాలోని ప్రధాన పంట అయిన వేరుశనగ ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాలు వేరుశనగ గరిష్టంగా రూ.10,940 పలికిందని, ఇప్పటివరకు ఇదే అత్యధిక ధర అని మార్కెట్ అధికారులు తెలిపారు. వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గడం, మార్కెట్‌లో డిమాండ్ పెరగడం వల్లే ఇంతటి భారీ పెరుగుదల ఉందని అధికారులు తెలిపారు. మధ్యస్థ ధర రూ.9,810, కనిష్ట ధర రూ.6000కు వ్యాపారులు కొన్నారు.

ముఖ్యంగా వేరుశనగ ప్రధాన పంటగా ఉన్న కరవు పీడిత మండలాల్లో రైతులకు ఈ పెరుగుదల పెద్ద ఉపశమనం కలిగించింది. కొన్ని రోజుల క్రితం ధరలు క్వింటాలుకు దాదాపు రూ.6,000కు పడిపోయాయి. అయితే అప్పటి నుండి ధరలు క్రమంగా పెరిగాయి. ఎమ్మిగనూరు మార్కెట్లో సగటు ధర ప్రస్తుతం క్వింటాలుకు రూ.9,810 వద్ద ఉందని అధికారులు తెలిపారు. రాకపోకలు పరిమితంగా కొనసాగి డిమాండ్ బలంగ...