భారతదేశం, ఫిబ్రవరి 2 -- రాష్ట్రవ్యాప్తంగా 72 లక్షల మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్స్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం వెల్లడించారు. కుప్పం నియోజకర్గం శాంతిపురం మండలం తుమ్మిశి గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. ఆ గ్రామంలోని ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను స్వయంగా పరిశీలించారు. సంజీవని ప్రాజెక్టు అమలు గురించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వివిధ అంశాలను తెలుసుకున్నారు.

గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యారోగ్య శాఖ రూపొందించిన డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా వివిధ ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారి నుంచి సమాచారం తెలుసుకున్నారు చంద్రబాబు. వారి ఆరోగ్యాన్ని మెరుగు పర్చేందుకు నిపుణు...