Telangana,bhadrachalam, జూలై 8 -- భద్రాచలం ఆలయ భూములకు సంబంధించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీలోని పురుషోత్తపట్నంలో ఉన్న భూముల్లో ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై అక్కడి గ్రామస్థులు దాడికి దిగారు. ఈ క్రమంలో ఈవో స్పృహ తప్పి పడిపోయారు.ఈ దాడిలో పలువురు సిబ్బంది కూడా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం కోలుకుంటున్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లా పరిధిలో భద్రాచలం రామాలయానికి చెందిన 889 ఎకరాల భూమి(పురుషోత్తపట్నం) ఉంది. రికార్డుల్లో ఉన్న లెక్కల ప్రకారం భూమి ఉండాల్సినప్పటికీ. పరిస్థితి అలా లేదు. చాలా కాలంగా ఇక్కడ ఉన్న భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. దీనిపై ఆలయ అధికారులకు.. అక్కడి గ్రామస్థులకు ఎప్పట్నుంచో వివాదం కొనసాగుతూ వస్తోంది. ఈ వ్యవహారంలో ఏపీ ...