భారతదేశం, డిసెంబర్ 19 -- పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటిన బీజేపీ. ఆ తర్వాత జరుగుతున్న పలు ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కంటోన్మెంట్ తో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ మూడో స్థానానికే పరిమితమైంది. తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ తక్కువ స్థానాలకే పరిమితమైంది. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర నాయకత్వం. కసరత్తు షురూ చేసింది.

గురువారం రాత్రి ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో పార్టీ ఎంపీలు సమావేశమైయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు మార్గదర్శకత్వంలో తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు.

ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్...