భారతదేశం, ఫిబ్రవరి 2 -- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుకు గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అంబటి రాంబాబుకు BNSS సెక్షన్ 35 (CrPC 41A) కింద నోటీసులు అందజేయాలని, అతనిపై నమోదైన మరో కేసుకు సంబంధించి దర్యాప్తు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అంబటి రాంబాబును శనివారం రాత్రి గుంటూరులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనను అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో వాంగ్మూలాలు నమోదు చేశారు. కోర్టు ముందు హాజరుపరిచే ముందు, వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు.

కస్టడీలో ఉన్నప్పుడు పోలీసులు తనను శారీరకంగా వేధించారని న్యాయమూర్తి ముందు హాజరుపరిచినప్పుడు అంబటి చెప్పినట్ట...