భారతదేశం, ఫిబ్రవరి 22 -- రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాసులు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కేసులో ఆదివారం నలుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు మేకల వేణుమాధవ్‌రెడ్డి సుపారీ గ్యాంగ్‌తో శ్రీనివాసులును హత్య చేసి మృతదేహాన్ని ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్‌లో కారుతో సహా పడేశాడు. హత్యకు దారితీసిన సంఘటనల క్రమాన్ని వివరించారు పోలీసులు. వారిద్దరూ పూర్వ విద్యార్థుల సమావేశంలో కలుసుకున్నారని, వారి కాంటాక్ట్ నంబర్లను మార్చుకున్నారని పోలీసులు తెలిపారు.

తార్నాక నివాసి అయిన బొగ్గుల శ్రీనివాస్ జీఎస్టీ లైసెన్స్ కలిగి ఉన్నాడు. జీఎస్టీలో నకిలీ ఇన్‌వాయిస్, అమ్మకాల పత్రాలను సమర్పించడం ద్వారా లాభాలు పొందవచ్చని కూకట్‌పల్లికి చెందిన మేకల వేణుమాధవ్ రెడ్డి అతనికి చెప్పాడు. శ్రీనివాసులు జీఎస్టీని వేణుమాధవ్ వాడుకున్నాడు. జీఎస్టీ లావాదేవీల్లో పెం...