భారతదేశం, ఫిబ్రవరి 6 -- మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంట్లో దాడి జరిగిన ప్రాంతాన్ని వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. జోగి రమేశ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి. ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని. భయపడాల్సిన అవసరం లేదన్నారు. పెట్రోల్ దాడి జరిగిన ప్రదేశాన్ని పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. పెట్రోల్‌ బాంబులతో దాడి చేసిన వీడియోలను జగన్ కు చూపించారు.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అ‍ంబటి ఇంట్లో కొనసాగించిన జంగిల్‌ రాజ్‌ పరంపరను జోగి రమేష్‌ విషయంలో కూడా కొనసాగించారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు జంగిల్ రాజ్ పాలనను చూసి.. నాగరిక ప్రపంచం తలదించుకుంటోందన్నారు. అంబటి రాంబాబు ఇంటిపై సాయంత్రం నుంచి అర్ధరాత్రివరకు దహనకాండను సాగించారని. మరుసటి రోజు జోగి రమేష్ విషయంలోనూ అదే పరంపర కొనసాగిందన...