భారతదేశం, జనవరి 5 -- ప్రతి ఏటా సెప్టెంబర్ నెల రాగానే టెక్ ప్రపంచమంతా యాపిల్ కొత్త ఐఫోన్ల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంది. దశాబ్ద కాలంగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది దిగ్గజ టెక్​ సంస్థ. అయితే, 2026లో ఈ ఆనవాయితీకి బ్రేక్ పడేలా కనిపిస్తోంది! యాపిల్ తన అప్ కమింగ్ మోడల్ 'ఐఫోన్ 18' స్టాండర్డ్ వెర్షన్‌ను 2026లో కాకుండా, 2027లో విడుదల చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

నివేదికల ప్రకారం.. యాపిల్ తన ప్రీమియం స్మార్ట్​ఫోన్స్​ అయిన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్​లను మాత్రం అనుకున్న సమయానికే, అంటే 2026 సెప్టెంబర్​లో విడుదల చేయనుంది. కేవలం సాధారణ ఐఫోన్ 18 లాంచ్‌ను మాత్రమే వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా యాపిల్ ప్రతి ఏడాది కొత్త మోడల్‌ను పరిచయం చేస్తుంది. గతంలో ఐఫోన్ 4, 4ఎస్​ మధ్య మాత్రమే 15 నెలల గ్యాప్ వచ్చింది. కానీ ఇప్పుడు వస్తున్న ...