భారతదేశం, జనవరి 29 -- సమ్మక్క-సారలమ్మ మేడారం మహాజాతర దృష్ట్యా భక్తులకు తక్షణ వైద్య సహాయం అందించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫస్ట్ రెస్పాండర్ 108 బైక్ అంబులెన్స్‌లను మోహరించింది. మేడారం జాతర ప్రాంతంలోని వివిధ కీలక ప్రదేశాలలో మొత్తం 40 ఫస్ట్ రెస్పాండర్ 108 బైక్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. రద్దీగా ఉండే ప్రదేశాలకు త్వరగా చేరుకుని, ఆలస్యం లేకుండా వైద్య సహాయం అందించడానికి ఈ బైక్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ బైక్ 108 సేవల ద్వారా జ్వరం, తలనొప్పి, వాంతులు లేదా అలసట వంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న భక్తులకు ప్రథమ చికిత్స, అవసరమైన ప్రాథమిక మందులు అందిస్తున్నారు. ఇందుకోసం కిట్ కూడా ఉంటుంది. బైక్ వెనకాల దానిని సెట్ చేశారు.

అంతేకాకుండా, పరిస్థితి తీవ్రంగా ఉన్న సందర్భాలలో భక్తులను సమీపంలోని ఆసుపత్రులకు తక్షణమే త...