భారతదేశం, ఫిబ్రవరి 5 -- ములుగు జిల్లాలోని మేడారంలో ఇటీవల జరిగిన సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ లైంగిక దాడికి సంబంధించిన నివేదికలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది.

ఈ సంఘటనలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐదుగురు యువకులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అన్ని మీడియా, సోషల్ మీడియా కథనాలు వైరల్ అయ్యాయి. వీటిని తాము పరిగణనలోకి తీసుకున్నట్లు మహిళా కమిషన్ పేర్కొంది.

ఈ విషయాన్ని పరిశీలించడానికి ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కమిషన్ సభ్యురాలు డెలినా ఖోంగ్‌డప్ అధ్యక్షత వహిస్తారు. ఎన్‌సీడబ్ల్యూ సీనియర్ కోఆర్డినేటర్ కంచన్ ఖత్తర్ సభ్యురాలిగా వ్యవహరిస్తారు. జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ నామినేట్ చ...