భారతదేశం, జనవరి 5 -- పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో చిట్ చాట్ చేశారు. ఈ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టులో వాదనలు బలంగా వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సూచించామని చెప్పారు.

'పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టులను మేం అన్ని ఫోరమ్‌లలో వ్యతిరేకిస్తున్నాం. మాజీ మంత్రి హరీశ్ రావు చూపిస్తున్న లేఖ ఈ ప్రాజెక్టులకు సంబంధించినది కాదు. పోలవరం-నల్లమల సాగర్ ఇంటర్ స్టేట్ రూల్స్‌కు వ్యతిరేకం అని జీఆర్ఎంబీ లేఖ రాశాం. మా అభిప్రాయాన్ని జీఆర్ఎంబీ కూడా సమర్థించింది.' అని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారు.

పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయని ఉత్తమ్ వెల్లడించారు. సుప్రీం కోర్టులో తెలంగాణ వాదనలను బలంగా వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి...