భారతదేశం, ఫిబ్రవరి 4 -- తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మిర్యాలగూడ మండలం గూడూరులో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో మాట్లాడారు.

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు వేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. 'కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలోనే రైతులకు లక్షా 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ప్రభుత్వం. 25 లక్షల 30 వేల మంది రైతులకు 21 వేల కోట్ల రూపాయ అప్పులు మాఫీ చేశాం. అప్పుల నుంచి రైతులను విముక్తి చేశాం. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన వెంటనే.. రైతు భరోసా డబ్బులు జమ చేస్తాం. ఇందుకోసం 9 వేల కోట్ల రూపాయు ఖర్చు అవుతుంది. ఈ 9 వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో నేరుగా వేస్...