భారతదేశం, మే 26 -- ేశంలో రుతుపవనాలు గడువుకు ముందే ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీ కంటే రెండు వారాల ముందుగానే ముంబైకి చేరుకున్నాయి. తాజాగా కురుస్తున్న వర్షం ముంబై నగరాన్ని అస్తవ్యస్తం చేసింది. ట్రాక్‌లపై నీరు నిలిచిపోవడంతో స్థానిక రైలు సేవలు ప్రభావితమయ్యాయి. మెట్రో, బస్సు, రోడ్డు ట్రాఫిక్ వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీ కంటే పక్షం రోజుల ముందుగానే ముంబైకి చేరుకోవడంతో.. 75 సంవత్సరాలలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 'నైరుతి రుతుపవనాలు మే 26న ముంబైని తాకాయి. గత 75 సంవత్సరాలలో ఇంత త్వరంగా ముంబైకి ఇది తొలి రుతుపవనాల రాక.' అని ఐఎండీ తెలిపింది. ముంబైకి రుతుపవనాలు సాధారణంగా వచ్చే తేదీ జూన్ 11. నైరుతి రుతుపవ...