భారతదేశం, డిసెంబర్ 2 -- మారుతీ సుజుకీ ఈ విటారాతో భారతీయ ఎలక్ట్రిక్​ వాహనాల మార్కెట్​లోకి గ్రాండ్​గా ఎంట్రీ ఇవ్వనుంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఈ మారుతీ సుజుకీ కొత్త ఈవీ ఈరోజు, డిసెంబర్​ 2న లాంచ్​కానుంది. మారుతీ కొత్త ఈవీ వ్యూహంలో భాగంగా రూపొందించిన ఈ ఎస్‌యూవీ, మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, మహీంద్రా బీఈ 6 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ లాంచ్‌తో కంపెనీ తన ప్రొడక్షన్​ వ్యూహంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకోనుంది.

ఈవీలను భారత్‌లో ఉత్పత్తి చేసి, సుమారు 100 దేశాలకు ఎగుమతులు చేయాలని మారుతీ సుజుకీ లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా అంతర్జాతీయ ఈవీ మార్కెట్‌లో అగ్రగామిగా మారాలనే ఆ కంపెనీ ఆశయాలకు ఈ-విటారా మరింత బలాన్ని ఇవ్వనుంది. భారతీయ ఈవీ మార్కెట్‌లో బలమైన ముద్ర వేయగల ...