భారతదేశం, ఫిబ్రవరి 6 -- బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీ మహీంద్రా ఎక్స్​యూవీ 700కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​గా ఇటీవలే మార్కె్​లోకి వచ్చిన ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ దుమ్మురేపుతోంది! ఈ కారు కోసం వినియోగదారులు క్యూ కడుతున్నారు. వేరియంట్, పవర్‌ట్రెయిన్ (పెట్రోల్/డీజిల్) ఆధారంగా ఈ ఎస్​యూవీ డెలివరీ కోసం కొన్ని వారాల నుంచి ఏకంగా ఏడాది వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తాజా గణాంకాల ప్రకారం.. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో మ్యాన్యువల్ కాన్ఫిగరేషన్లకు వెయిటింగ్ పీరియడ్ భారీగా ఉంది. ఈ నేపథ్యంలో మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ వెయిటింగ్ పీరియడ్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ఏఎక్స్​: 12 నెలలు-

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన 'ఏఎక్స్​' వేరియంట్​ కోసం ప్రస్తుతం అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉంది. రూ. 12.79 లక్...