భారతదేశం, ఫిబ్రవరి 4 -- రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో ఆస్తి వివాదంలో 34 ఏళ్ల మహిళా న్యాయవాదిని ఆమె సోదరుడు హత్య చేయించాడు. గ్యాంగ్‌తో చెల్లెలు స్వప్నను చంపించాడు అన్న. ఈ హత్యపై న్యాయవాదులు నిరసన తెలిపారు. వెంటనే నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిని దిగ్బంధించారు.

కుటుంబ ఆస్తి వివాదంలో మహిళా న్యాయవాదిని ఆమె సొంత అన్న హత్య చేయించాడు. బాధితురాలు స్వప్న చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాది. పోలీసుల దర్యాప్తు ప్రకారం, ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న ఆస్తి వివాదాన్ని పరిష్కరించడానికి పంచాయితీ జరుగుతున్న వ్యవసాయ భూమికి స్వప్న వెళ్లింది.

ఉదయం పొలానికి వెళ్లిన సమయంలో స్వప్నను ముసుగులు ధరించి కారులో వచ్చి కత్తితో పొడిచి చంపి పారిపోయారు. సుపారీ గ్యా...