భారతదేశం, జనవరి 22 -- ఏపీ లిక్కర్ కేసులో ఈడీ నుంచి నోటీసులు అందుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ విచారణకు హాజరయ్యారు. 7 గంటల పాటు ఆయన విచారణ కొనసాగింది. లిక్కర్ పాలసీ విధాన నిర్ణయాలు, ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. విజయసాయిరెడ్డి స్టేట్‌మెంట్ ను ఈడీ అధికారులు రికార్డు చేశారు.

ఈడీ విచారణ తర్వాత బయటికి వచ్చిన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తిరిగి రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు.

"నేను రాజకీయాల నుంచి తప్పుకోను. నా భవిష్యత్ ప్రణాళికలను త్వరలో ప్రకటిస్తాను. ఈ నెల 25తో నాకు రాజకీయాల్లో ఏడాది ముగుస్తుంది. తిరిగి రాజకీయాల్లోకి వస్తాను" అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

పార్టీలో నంబర్‌ 2 స్థానం అనేది లేదని స్వయంగా వైఎస్ జగన్ చెప్పారని ఈడీకి తెలిపానని విజయసాయిరెడ్...