భారతదేశం, జనవరి 6 -- మహీంద్రా అండ్ మహీంద్రా తన పవర్‌ఫుల్ ఎస్​యూవీ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ.. సరికొత్త ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓను లాంచ్ చేసింది. ఇది ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీల్లో ఒకటైన ఎక్స్​యూవీ 700కి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్. ఇప్పటికే ఎక్స్​యూవీ 300ను ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓగా మార్చిన సంస్థ.. ఇప్పుడు అదే బాటలో తన ఫ్లాగ్‌షిప్ ఎస్​యూవీ పేరును కూడా మార్చేసింది. ఈ నేపథ్యంలో ఈ మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ సరికొత్త మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ఎస్​యూవీ ధర రూ. 13.66 లక్షల నుంచి రూ. 22.47 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది. అయితే, ఈ ప్రారంభ ధరలు కేవలం మొదటి 40,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.

టెస్ట్ డ్రైవ్: జనవరి 8, 2026 నుంచి ప్రారంభం.

బుకింగ్స...