భారతదేశం, నవంబర్ 8 -- అమెరికాకు వెళ్లాలనుకునే విదేశీయులకు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రభుత్వం మరో షాక్​ ఇచ్చినట్టు కనిపిస్తోంది! ఇప్పటికే కఠిన రూల్స్​ని తీసుకొచ్చిన ట్రంప్​ యంత్రాంగం.. వీసా దరఖాస్తుదారుడికి మధుమేహం, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే, అప్లికేషన్​ని తిరస్కరించే విధంగా ఆదేశాలను జారీ చేసింది.

ఈ మార్గదర్శకాలను స్టేట్ డిపార్ట్‌మెంట్ జారీ చేసింది. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు అమెరికా వనరులను హరించివేసే "పబ్లిక్ ఛార్జ్"గా మారవచ్చని పేర్కొంది. వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేసే కేఎఫ్​ఎఫ్​ హెల్త్ న్యూస్ కథనం ప్రకారం.. ఈ మార్గదర్శకాలను అమెరికన్ రాయబార కార్యాలయాలకు, కాన్సులేట్‌లకు ఇప్పటికే పంపించారు.

సంక్రమణ వ్యాధుల స్క్రీనింగ్, టీకా చరిత్ర, అంటు వ్యాధులు, మానసిక ఆరోగ్య పరిస్థితుల తనిఖీ వంటివి వీసా దరఖాస్తు ప్రక్రియలో ఎప్పుడూ భాగంగా...