Hydarabad, Oct. 24 -- తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలకు 95,436 దరఖాస్తులు వచ్చాయి. దీనితో రూ. 2,863 కోట్ల ఆదాయం సమకూరింది. మద్యం దుకాణం దరఖాస్తుకు ప్రతి దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్-రీఫండబుల్ ఫీజు వసూలు చేసిన తర్వాత ఈ ఆదాయాన్ని ఆర్జించింది ప్రభుత్వం. గురువారం గడువు ముగిసే సమయానికి 95 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజున, నాంపల్లిలోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంతో సహా అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలు, ఎక్సైజ్ పోలీసు పరిమితుల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద పెద్ద క్యూలు కనిపించాయి.

రాత్రి వరకు అధికారులు వివిధ కౌంటర్లలో దరఖాస్తులను స్వీకరిస్తూనే ఉన్నారు. 95,436 దరఖాస్తులు అందాయి, దీని వలన రూ.2863 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలోని 34 ఎక్సైజ్ జిల్లాల్లో 2,620 ఏ4 మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు మంజూరు చేయడానికి ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. చ...