Telangana, అక్టోబర్ 11 -- తెలంగాణ కాంగ్రెస్ లో మరో ఇద్దరు ముఖ్య నేతల మధ్య విబేధాలు తెరపైకి వచ్చాయి. ఆ ఇద్దరు నేతలు కూడా కేబినెట్ లో మంత్రులుగా ఉన్నారు. ఈ వివాదానికి కారణం టెండర్ల వ్యవహారమని తెలుస్తోంది. తన శాఖలో సదరు మంత్రి జోక్యమేంటని ప్రశ్నిస్తూ. సీఎంతో పాటు పార్టీ అగ్రనాయకత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో గంత కొద్దిరోజులుగా కేబినెట్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు. రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ మారాయి.

ఇటీవలనే మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్ వ్యవహారం అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో మంత్రి పొన్నం వెనక్కి తగ్గి.. క్షమాపణలు కూడా చెప్పటంతో విషయం సద్దుమణిగింది. అయితే తాజాగా మంత్రి పొంగులేటిపై మరో మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

మేడారం ఆలయ టెండర్ల విషయం వీరి మధ్య విబేధాలకు ప్రధాన కారణమైనట్లు తెలుస్తోంద...