భారతదేశం, ఏప్రిల్ 29 -- తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్తను మర్డర్ చేయించడానికి ప్లాన్ చేసింది ఓ భార్య. తన ప్రియుడితో కలిసి రూ.15 లక్షలకు సుపారీ గ్యాంగ్‌ను మాట్లాడింది. ప్లాన్ ప్రకారం హత్య చేసేందుకు దుండగులు దాడి చేయగా.. స్థానికులు అడ్డుకున్నారు. భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. భార్య, ఆమె ప్రియుడు, సుపారీ గ్యాంగ్‌ నిందితులు కటకటాలపాలయ్యారు.

జిల్లా ఎస్పీ రాజేష్‌చంద్ర వివరాల ప్రకారం.. ఘన్‌పూర్‌(ఎం) గ్రామానికి చెందిన సాడెం కుమార్, రేణుక భార్యాభర్తలు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపలి గ్రామ సమీపంలోని ఓ ఆలయంలో పూజారిగా పనిచేసే కాంపల్లి మహేష్‌తో.. రేణుకకు గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. అయితే.. భర్త కుమార్‌ను హత్య చేస్తే అడ్డు తొలగడంతోపాటు.. అతని ఆస్తి కూడా తమకు దక్కుతుందని ఈ ఇద్దరు కుట్ర పన్నారు.

ఆలస్యం చేయకుండా.. మహేష్‌ మేడ్చల్‌...