భారతదేశం, నవంబర్ 3 -- ఇంట్లోకి కొత్త స్మార్ట్​ టీవీ కొనాలనుకుంటున్నా, లేదా మీ పాత స్క్రీన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నా.. రూ. 30,000 బడ్జెట్ విభాగంలో పర్ఫార్మెన్స్​, ఉపయోగకరమైన ఫీచర్లు, నాణ్యతను కలిపి అందించే అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి! సోనీ నుంచి ఎల్‌జీ వరకు ప్రముఖ బ్రాండ్లు ఈ ధరలో ఫుల్ హెచ్‌డీ, 4కే మోడళ్లను అందిస్తున్నాయి. ఇవి మెరుగైన విజువల్స్​ని, మంచి సౌండ్ అవుట్‌పుట్‌ను, అలాగే స్ట్రీమింగ్, గేమింగ్ లేదా సాధారణ వీక్షణ కోసం సులభమైన కనెక్టివిటీని అందిస్తాయి.

ఈ ప్రైజ్​ పాయింట్​లో స్మార్ట్ టీవీలు ప్రధాన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు మద్దతు ఇస్తాయి. స్పష్టమైన పిక్చర్ క్వాలిటీతో పాటు గూగుల్ టీవీ, వెబ్‌ఓఎస్ వంటి స్మార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో రూ. 30,000లోపు అందుబాటులో ఉన్న కొన్ని అగ్రశ్రేణి స్మార్ట్ టీవీ ఆప్ష...