భారతదేశం, నవంబర్ 3 -- ఇటీవల కర్నూలు జిల్లా చిన్నటేకూరు బస్సు ప్రమాదం మరవకముందే ఏపీలో మరికొన్ని ఘటనలు జరిగాయి. తాజాగా బాపట్ల జిల్లాలోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో కారు, లారీ ఢీ కొట్టాయి. దీంతో నలుగురు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం సత్యవతిపేటలో ఘోర ప్రమాద జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కారు, లారీ బలంగా ఢీ కొట్టాయి. కారులో ఉన్న నలుగురు మరణించారు. మృతులను కర్లపాలెం చెందిన బేతాళం బలరామరాజు, బేతాళం లక్ష్మీ, గాదిరాజు పుష్పవతి, ముదుచారి శ్రీనివాసరాజుగా గుర్తించారు. ఇందులో ఇద్దరు బాలురు కూడా గాయపడ్డారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడి సంగీత్‌కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్త...