భారతదేశం, డిసెంబర్ 30 -- బంగ్లాదేశ్​ తొలి మహిళా ప్రధానమంత్రి ఖలీదా జియా కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న 80ఏళ్ల జియా మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

ఈ మేరకు ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశీ నేషనలిస్ట్​ పార్టీ ఒక ప్రకటన చేసింది.

"మన ప్రియతమ నేత బేగమ్​ ఖలీదా జియా ఇక లేరు. ఫజర్​ ప్రార్థనలు ముగిసిన కొద్ది సేపటికే, ఉదయం 6 గంటల ప్రాంతంలో ఖలీదా జియా ప్రాణాలు విడిచారు," అని బీఎన్​పీ ఫేస్​బుక్​ పేజ్​లో పోస్ట్​చేసింది.

వైద్యుల ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఖలీదాకు అడ్వాన్స్​డ్​ లివర్​ సిర్రోసిస్​, ఆర్థిరైటిస్​, డయాబెటిస్​, ఛాతి- గుండె సమస్యలు ఉన్నాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....