Andhrapradesh, ఆగస్టు 8 -- ఉత్తర అంతర కర్ణాటక ప్రాంతం మరియు దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ పేర్కొంది. దక్షిణ కోస్తా ఏపీపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, సగటు సముద్ర మట్టానికి 1.5, 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని తెలిపింది.

దక్షిణ కోస్తా ఏపీ నుంచి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు తీరం మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉత్తర - దక్షిణ ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. ఆగస్ట్ 13, 2025 నాటికి వాయువ్వ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో. ఆగస్ట్ 14 వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఆగస్టు 12...