Andhrapradesh, జూలై 25 -- ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చని వాతావరణశాఖ పేర్కొంది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన ప్రకారం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతంలో మరింత బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉంది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాల వైపు కదులేందుకు అవకాశం ఉందని అంచనా వేసింది.

అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో ఆదివారం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యేందుకు ఛాన్స్ ఉంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించింది. పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ఇవాళ (జూలై 25) శ్రీకా...